పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయని ఎన్‌టిఆర్…ఎందుకంటే…?
Ntr sons : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు,ప్రముఖులు విస్తృతంగా తమకు నచ్చిన అంశాలను పంచుకుంటూ,ఫోటోలు,వీడియోలు షేర్ చేస్తున్నారు.ఇక సెలబ్రిటీల పిల్లలు కూడా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ,అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తమ పిల్లల ఫోటోలు, విడియోలు పెద్దగా సోషల్ మీడియాలో పెట్టడం లేదు.
అలాగే సినిమా ఫంక్షన్స్ కి కూడా తీసుకు రావడం లేదు. అయితే పిల్లలు అభిరాం, భార్గవ రామ్ లతో మాత్రం ఎక్కువగా గడపడానికి తారక్ ఉత్సాహం చూపిస్తాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్టింగ్ చేయడు. దీనికి కారణం ఏమిటని ఆరా తీస్తే, పిల్లలపై స్టార్ డమ్ ప్రభావం పెద్దగా పడకూడదని చేబుతాడట. అవును తారక్ పీఆర్వో మహేష్ కోనేరు వెల్లడించారు.
తారక్ ఈ మధ్య కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ తో కల్సి మల్టీస్టారర్ చేస్తున్నాడు. తారక్ పెద్ద కొడుకు అభిరామ్ కి మొహమాటం ఎక్కువట. చిన్న కొడుకు భార్గవరామ్ పెద్ద కొడుక్కి పూర్తి రివర్స్ లో ఉంటాడట. భార్గవ రామ్ ఒకచోట కుదురుగా ఉండడని మహేష్ కోనేరు మాటలను బట్టి తెలుస్తోంది.