చంద్రమోహన్ కి ఉన్న సెంట్ మెంట్స్ తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Tollywood Hero chandramohan :చంద్రమోహన్ సెంటిమెంట్స్ తెలిస్తే షాకవుతారు వచ్చింది ఏ పాత్ర అయినా కావచ్చు అందులో ఇమిడిపోయి నటించడం నటుడు చంద్రమోహన్ లక్షణం. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోతున్న చంద్ర మోహన్ కి ఎందరో అభిమానులు ఇప్పుడు కూడా ఉన్నారు. 1966లో రంగుల రాట్నం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి,ఆనాటి నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఏమీ మిగుల్చుకోకుండా పొతే,మరికొందరు బాగా కూడబెట్టారు. దాచుకున్న వాళ్లలో చంద్రమోహన్ ఒకరు. అందరి లాగే ఈయనకు కూడా సెంటిమెంట్స్ ఎక్కువే.
సంపాదిస్తున్న సమయంలోనే జాగ్రత్త పడిన చంద్రమోహన్ మద్రాసులో,హైదరాబాద్ లో స్ధలాలు, ఆస్తులు బాగానే కూడబెట్టారు. ఇండస్ట్రీలో మహామహులు సంపాదించినా,ఎలా పోగొట్టుకున్నారో ప్రత్యక్షంగా చూసినందున ఎక్కువ జాగ్రత్త పడ్డారు. ఇక ఈయన పక్కన నటిస్తే లక్కీ అనే నమ్మకం చాలామంది హీరోయిన్స్ కి వుంది. ఎందుకంటే టాప్ పొజిషన్ కి వెళతామనే నమ్మకం బలంగా ఉంది. దానికి తగ్గట్టుగానే వాణిశ్రీ, జయప్రద,శ్రీదేవి,మాధవి,తాళ్ళూరి రాజేశ్వరి,సులక్షణ, ఇలా ఎందరో ఉన్నారు. సిరిసిరి మువ్వలో జయప్రద,పదహారేళ్ళ వయస్సులో శ్రీదేవి ఈయన పక్కన నటించి టాప్ స్టార్స్ అయిపోయారు.
దక్షిణ దిశ గల ఇల్లు అయితే చాలా మంచిదని,అందుకే ఇల్లు కట్టేటప్పుడు అలాగే చేశానని చంద్రమోహన్ ఓ పత్రిక ఇంటర్యూలో చెప్పారు. అంతకుముందు దక్షిణ దిశలేని ఇళ్లల్లో ఉండడం వలన ఏవో ఒడిడుకులు వచ్చేవన్నారు. ఇక మంగళవారం,శుక్రవారం చాలా శుభప్రదమైన వారాలని ,అలాంటి రోజుల్లో ధనలక్ష్మి మన ఇంటికి రావాలని ఎవరికీ ఇవ్వకూడదన్నది చిన్నప్పటి నుంచి నమ్మకమని అన్నారు. అందుకే ఎవరికీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేకుండా జాగ్రత్త పడుతుంటానని చెప్పారు.