MoviesTollywood news in telugu

నయనతార రెమ్యూనరేషన్ పై గుసగుసలు…షాక్ అవ్వాలసిందే

Nayanthara remuneration :సినిమా హిట్ అయితేనే హీరోకైనా, హీరోకైనా క్రేజ్. సినిమా ప్లాప్ అయితే ఒక్కరు కూడా ముఖం చూడరు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది విషయంలో జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అందులో హీరోయిన్స్ విషయంలో అస్సలు పట్టించుకోరు. అందుకే కొందరు హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మాత్రమే 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంటే, కొందరు సౌత్ హీరోయిన్ల పారితోషికం 2 కోట్ల రూపాయల లోపే తీసుకుంటున్నారు. ఇక నటనలో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ నయనతార తన రెమ్యునరేషన్ విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న ఈమె సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొనదు. అయినా ఈమె క్రేజ్ దృష్ట్యా ప్రొడ్యూసర్స్ కూడా వెంటపడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న నయనతార తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు నయనతార పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతారకు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లు పెరగడంతో పాటు రెమ్యునరేషన్ కూడా హెచ్చుతోంది.

నయనతార ప్రస్తుతం నేట్రిగన్ సినిమాలో నటించగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా నిర్మాతలకు ఏకంగా 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఊహించని స్థాయిలో నిర్మాతలకు తన సినిమాల వల్ల ఆదాయం పెరగడంతో నయనతార రెమ్యునరేషన్ పెంచేసింది. అయితే కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల నిర్మాతలకు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా నేపథ్యంలో స్టార్ హీరోలకు సమానంగా నయనతార రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం చర్చకు దారితీస్తోంది. నయనతార పారితోషికం రెట్టింపు చేయడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచేసింది, ఒకవేళ ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆమె క్రేజ్ కూడా తగ్గిపోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.