సోనూసూద్ తండ్రి ఎవరు…ఏం చేసేవారో తెలుసా?
Real Hero sonusood :లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకూ ఎందరినో ఆడుకుంటున్న నటుడు సోనూసూద్ రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. వలస కార్మికుల మొదలు విద్యార్థులు,ఆపన్నుల వరకూ అందరిని అడ్డుకోవడంతో పాటు ప్రస్తుతం ఆక్సిజన్ కూడా అందిస్తున్నాడు. మనదేశంలో ఎవరు ఏం పని చేసినా దానివెనుక సవాలక్ష కారణాలు వెతుకుతారు. సోనూసూద్ విషయంలో కూడా రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఉంది కనుక చేస్తున్నాడని పెదవి విరిచారు. అయితే చాలామంది కోట్లు గడుస్తున్నా చేయలేని పని సోనూసూద్ చేస్తున్నాడని కోట్లాదిమంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కరోన వైరస్ ఎంతోమంది హృదయాలను ముక్కలు చేస్తోందని,గతంలో ఇటువంటి సంక్షోభాన్ని ఎవరూ చూడలేదని సోనూసూద్ వెల్లడించారు. తనకు జన్మనిచ్చిన తల్లి,తండ్రులు ఆక్సిజన్ సిలిండర్లు,బెడ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే మాత్రం తాను తట్టుకునే వాడిని కాదని సోనూసూద్ చెప్పుకొచ్చాడు. అందుకే తను చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా,సోనూసూద్ మాత్రం మౌనంగానే ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసుకుంటూ పోతున్నాడు.
తాజాగా ఓ ఇంటర్యూలో సోనూసూద్ తన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చాడు. తన తండ్రి శక్తి సాగర్ పంజాబ్ లో బిజినెస్ చేసేవారని, ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే తనతో కలిసి వాళ్లకు ఆహారం అందజేయడంతో పాటు ఇతర సామాగ్రిని అందజేసేవారని,ఇక తన తల్లి సరోజ్ సూద్ పేద విద్యార్థులకు ఫ్రీగా చదువు చెప్పేదని సోనూసూద్ వివరించాడు. అయితే తల్లీ తండ్రి కూడా అనారోగ్య సమస్యలతో మరణించడం వలన ప్రస్తుత పరిణామాలపై సోనూ చలించిపోతూ తనకు తోచిన రీతిలో సాయపడే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు.