కార్తీకదీపం చైల్డ్ ఆర్టిస్ట్ ల పారితోషికం ఎంతో తెలుసా?
karthika deepam child artits remuenration : సినిమాల్లో ఏమోగానీ టివి సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టులకు గిరాకీ ఉండడమే కాదు, రెమ్యునరేషన్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటోంది. ఇక బుల్లితెరమీద పాపులర్ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్ పై ఉత్కంఠ నెలకొంది. ఇందులో దీప చనిపోతుందన్న వార్త పలువురు ఆడియన్స్ ని బాధిస్తుండగా, ముందు ముందు సీరియల్ ఎలా నడుస్తుందనే టాక్ నడుస్తోంది. రోజుకో ట్విస్ట్ మలుపులతో సాగిపోతోంది.
ఈ సీరియల్ లో నటీనటులకు రెమ్యునరేషన్ గురించి కూడా ఆడియన్స్ లో చర్చ నడుస్తోంది. రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేవిధంగా నిర్వాహకులు సీరియల్ ని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే కార్తీక్,దీపల మధ్య అనుబంధాన్నిఆడియన్స్ కి వెరైటీగా తెలియజేస్తూ,మంచి రంజుగా నడిపిస్తున్నారు.
కార్తీక్,దీప ల పిల్లలుగా సౌర్య, హిమ నటిస్తున్నారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో అదరగొడుతున్నారు. వీరిద్దరూ రోజువారీ పారితోషికం కింద సుమారు లక్ష రూపాయలు అందుకుంటున్నారని టాక్. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు కూడా లభిస్తోంది.