MoviesTollywood news in telugu

పౌర్ణమి మూవీ ప్లాప్ కి ప్రభుదేవాకి సంబందం ఏమిటో తెలుసా?

pournami Full Movie :సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అది వెంటనే దర్శకుడి మీద పడుతుంది. తర్వాత హీరో,హీరోయిన్స్ మీదా ఉంటుంది. హిట్ ఉంటేనే గౌరవం, లేకుంటే ఎవరూ దరిచేరరు. సినిమా హిట్ అయితే ఎంతగా ఎత్తేస్తారో, ప్లాప్ అయితే అంతగా గుసగుసలు వినిపిస్తాయి. కొన్నిసార్లు గొడవలు కూడా తప్పవు. నిర్మాత ఎం ఎస్ రాజు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్నో మ్యూజికల్ హిట్స్ సినిమాలు నిర్మించాడు. మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి హిట్స్ ఎన్నో ఉన్నాయి.

అయితే ప్రభాస్ తో వర్షం మూవీ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి ఎం ఎస్ రాజు నిర్ణయించాడు. అప్పటికే నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిట్ కావడంతో ఆ సినిమా డైరెక్టర్ గా వ్యవహరించిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ను డైరెక్టర్ గా పెట్టి,పౌర్ణమి మూవీ ప్లాన్ చేసాడు. ఛత్రపతి మూవీతో భారీ హిట్ కొట్టిన తరవాత పౌర్ణమి రిలీజవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే పొర్ణమి ప్లాప్ కావడంతో ఎం ఎస్ రాజు, ప్రభుదేవా మధ్య గొడవ కూడా అయిందని అప్పట్లో టాక్ వచ్చింది. అయితే అలాంటిదేమీ జరగలేదని ఇటీవల ఎం ఎస్ రాజు స్వయంగా వివరణ ఇచ్చాడు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి రాఘవేంద్ర మూవీ కూడా డిజాస్టర్ కావడంతో హిట్ కోసం తపిస్తున్న ప్రభాస్ కి వర్షం మూవీ భారీ హిట్ అందించింది. దీనికి ఎం ఎస్ రాజు నిర్మాత.