MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న హీరో హీరోయిన్స్

Tollywood Best Friends :ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ గా కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. అంతేకాదు, మంచి ఫ్రెండ్షిప్ కూడా సాగిస్తుంటారు. అందులో ముఖ్యంగా ఒకప్పుడు న్యాయం కావాలి మూవీ నుంచి దాదాపు 25చిత్రాలకు పైగా కల్సి నటించిన మెగాస్టార్ చిరంజీవి, రాధిక మంచి ఫ్రెండ్స్. ఇప్పటికీ వారి స్నేహం కొనసాగుతోంది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ల మధ్య ఏదో సంబంధం ఉందని అప్పటిలో వార్తలు కోడై కూశాయి. కానీ వాటిని పట్టించుకోకుండా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

ఒకరు స్టార్ హీరో, ప్లస్ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. మరొకరు వైసిపి నగరి ఎమ్మెల్యే , ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా. వీరిద్దరూ వేరువేరు పార్టీలు అయినప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. ఇక ప్రభాస్ – స్వీటీ అనుష్క ల మధ్య కూడా ఏదో ఉందని పుకార్లు వచ్చినా కొట్టిపారేసి, మంచి స్నేహితులుగా ఉంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలుసార్లు వార్తలు కూడా వచ్చాయి. జెనీలియా,హీరో రామ్ పోతినేని వీరిద్దరూ మంచి స్నేహితులు. నిజానికి ఇద్దరూ కల్సి చేసింది ఒకే సినిమా అయినా స్నేహ బంధం ఏర్పడింది. రామ్ ముంబై వెళ్తే, జెనీలియా ఇంటికి వెళ్తాడు. ఆమె హైదరాబాద్ వస్తే,రామ్ ఇంట్లో ఉంటుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ . వీరు మగధీరతో సహా నాలుగు సినిమాల్లో కల్సి నటించారు. అలాగే హీరో బెల్లంకొండ సురేష్ తో కూడా కాజల్ కి మంచి స్నేహం ఉంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్,హీరోయిన్ రాశిఖన్నా బయట కొట్టుకున్నట్లు కన్పిస్తారు కానీ, మంచి ఫ్రెండ్స్. నేను లోకల్ మూవీతో నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మధ్య ఏర్పడ్డ స్నేహం కొనసాగుతోంది. అలాగే నివేదితా థామస్ తో కూడా నానికి మంచి స్నేహం ఉంది. రోజుకి ఒకసారైనా ఇద్దరూ పలకరించుకుంటారు.