యాంకర్ ఓంకార్ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందో తెలుసా?
Telugu Anchor Omkar :బుల్లితెరపై యాంకర్ గా,ప్రొడ్యూసర్ గా,డైరెక్టర్ గా ఓంకార్ తన సత్తా చాటాడు. ఏ ఛానల్ ఏ షో కి యాంకరింగ్ చేసినా టిఆర్పి రేటింగ్ అదిరిపోతోంది. ఇతడి పూర్తిపేరు ఆడియట్ల ఓంకార్ . 1980 మార్చి 13న ఏపీలోని కాకినాడలో జన్మించిన ఓంకార్ వయస్సు 41 సంవత్సరాలు. తండ్రి ఎన్వీ కృష్ణారావు, తల్లి గృహిణి. ఓంకార్ కి అశ్విన్, కళ్యాణ్ అనే బ్రదర్స్ ఉన్నారు. ఇతడికి 35కోట్ల వరకూ ఆస్థి ఉంది.
కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్ లో చదువుకున్న ఓంకార్ గుంటూరు సిద్ధార్ధ కాలేజీలో బైపీసీ పూర్తిచేసిన ఓంకార్ కి పెద్దల ఆశీర్వాదంతో స్వరూప అనే అమ్మాయితో పెళ్లయింది. వీరికి ఓ అమ్మాయి ఉంది. క్రికెటర్ అవుదామనుకుని అది కుదరకపోవడంతో సినిమా రంగం వైపు అడుగులు వేసాడు. అయితే ఆదిత్య మ్యూజికల్స్ ఆడిషన్స్ లో యాంకర్ గా సెలక్టయిన ఓంకార్ తక్కువ సమయంలో బాగా క్లిక్ అయ్యాడు. ఇక 2007లో ఆట డాన్స్ లో ఓంకార్ యాంకర్ గా ఛాన్స్ కొట్టేసాడు. ఆ షోతో ఓంకార్ అన్నయ్య అని అందరితో ప్రేమగా పిలిపించుకునే వాడు.
మాయాద్వీపం,ఛాలెంజ్,అదృష్టం,సరిగమప షోస్ తో బాగా దగ్గరయ్యాడు. రోజుకి 60వేల నుంచి 70వేలు రెమ్యునరేషన్ అందుకుంటాడు. పలు టివి షోస్ కి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఇతడికి రెండు విలాసవంతమైన కార్లున్నాయి. గచ్చిబౌలిలో నిహారిక అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారు. ఇందులో ప్లాట్ ఖరీదు కోటిన్నర వరకూ ఉంటుంది. చిరంజీవి, వెంకటేష్ అభిమాన నటులు. ఇష్టమైన హీరోయిన్ తాప్సి. ముంబై అంటే ఇష్టం. బిర్యానీ, చపాతీ అంటే బాగా ఇష్టంగా తింటాడు. ప్రయాణం, బుక్స్ చదవడం ఇష్టం.