MoviesTollywood news in telugu

ఇతర భాషల్లో రీమేక్ అయిన తెలుగు సీరియల్స్ ఎన్ని ఉన్నాయో…?

Telugu serials remade in other languages :టాలీవుడ్ సినిమాల కన్నా తెలుగు బుల్లితెర సీరియల్స్ వైపు మన వాళ్ళు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. అందుకే తెలుగు ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బుల్లితెర నటులకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అయితే తెలుగులో వచ్చే సీరియల్స్ లో ఎక్కువ భాగం ఇతర భాషల నుంచి రీమేక్ చేసినవే. అయితే మన తెలుగు భాషలో వచ్చే సీరియల్స్ కూడా వేరే భాషల్లో రిమేక్ అవ్వడం విశేషం. నిఖిల్ ,కావ్యశ్రీ లీడ్ రోల్స్ లో నటించిన గోరింటాకు సీరియల్ మంచి సక్సెస్ ని అందుకుని ఇటీవల పూర్తయింది. హిందీలో మెహందీ రచనే వాలీ , బెంగాలీలో అలాగే ఇంకా కొన్ని భాషల్లో కూడా తర్జుమా చేసారు.

జి తెలుగులో ప్రసారమవుతున్న నాగభైరవి సీరియల్ ని కన్నడలో ఇదే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. జి తెలుగులో ప్రసారమయ్యే హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ ని కన్నడలో హిట్లర్ కళ్యాణ్ గా రీమేక్ చేస్తున్నారు. అలాగే మాటీవీలో వస్తున్న దేవత సీరియల్ ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక దీపంలో నెగెటివ్ రోల్ చేసిన మోనిత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. జి తెలుగులో వచ్చిన ముద్దమందారం సీరియల్ ని కూడా కన్నడలో పారు పేరిట రీమేక్ చేస్తున్నారు. ప్రియాంక జైన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మౌనరాగం సీరియల్ ని కన్నడలో మౌనరాగం, తమిళంలో కత్రి మోజీగా రీమేక్ చేసారు.

జి తెలుగులో సక్సెస్ ఫుల్ గా నడిచిన అమెరికా అమ్మాయి సీరియల్ ని కూడా ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. మెరీనా రోహిత్ లీడ్ రోల్ లో నటించిన ఈ సీరియల్ ని తమిళంలో సూర్యవంశం సీరియల్ గా రీమేక్ చేసారు. జెమినిలో చాలాకాలం నడిచిన చక్రవాకం సీరియల్ ని కన్నడలో చక్రవాక సీరియల్ గా రీమేక్ చేసారు. మేఘనా లోకేష్, సిద్ధూ కీలక పాత్రల్లో నటించిన, జి తెలుగులో వచ్చిన రక్తసంబంధం సీరియల్ తాజాగా ముగిసింది. తమిళంలో దీన్ని రాజా మగళ్ గా రీమేక్ చేస్తున్నారు. పల్లవి రామ్ శెట్టి, అలిసా ముఖ్య పాత్రలు పోషించిన మాటే మంత్రం సీరియల్ ని కన్నడంలో రాధా కల్యాణ గా, తమిళంలో గోకులతి సీతగా రీమేక్ చేసారు.