కృష్ణ, శోభన్ బాబు మల్టీస్టారర్ హిట్స్ ఎన్ని ఉన్నాయో…?
Krishna And Sobhan babu Movies :మల్టీస్టారర్ మూవీస్ కి పెట్టింది పేరుగా నిల్చిన నటశేఖర్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు కల్సి నటించిన చిత్రాలు చాలావరకూ సూపర్ హిట్ అయ్యాయి. అందులో కొన్నింటిని పరిశీలిస్తే, 1968లో వచ్చిన లక్ష్మి నివాసం మూవీలో కృష్ణ,శోభన్ బాబు,ఎస్వీ రంగారావు నటించారు. వి మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
తమిళ సినిమాకు రీమేక్ గా 1969 లో రిలీజైన మంచి మిత్రులు మూవీలో కృష్ణ ,శోభన్ బాబు తమ నటనతో అలరించారు. గజదొంగ గంగారాంగా కృష్ణ, పోలీసాఫీసర్ గా శోభన్ బాబు నటించి ఒకప్పటి స్నేహాన్ని గుర్తుతెచ్చుకుంటారు. చివరిలో కృష్ణ చనిపోయే ఘట్టం కంటతడి పెట్టిస్తుంది. అలాగే పుట్టినిల్లు,మెట్టినిల్లు మూవీ ధనవంతులైన అన్నాచెల్లెళ్లుగా కృష్ణ లక్ష్మి, పెద్దవాళ్ళైనా అన్నాచెల్లెళ్లుగా శోభన్ బాబు, చంద్రకళ నటించారు. 1973లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఏవిఎం సంస్థ నిర్మించింది.
వాణిశ్రీ డబుల్ రోల్ లో కృష్ణ ,శోభన్ బాబు నటించిన గంగ మంగ మూవీ 1973లో రిలీజై అఖండ విజయాన్ని అందుకుంది. విజయ సంస్థ ఈ మూవీ నిర్మించింది. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ముందడుగు మూవీ 1983లో రిలీజై అఖండ విజయాన్ని నమోదుచేసుకుంది. కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీదేవి, జయప్రద హీరోయిన్స్ గా చేసారు. అలాగే రామానాయుడు నిర్మించిన మండే గుండెలు మూవీకి కూడా బాపయ్య డైరెక్టర్.
కృష్ణ, శోభన్ బాబు నటించిన ఈ మూవీలో జయప్రద, జయసుధ హీరోయిన్స్ గా నటించారు. ఇది 1979లో రిలీజై, అద్భుత విజయాన్ని అందుకుంది. మా మంచి అక్కయ్య మూవీలో కృష్ణ, శోభన్ బాబు కె ఆర్ విజయ నటించారు. ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు కానీ, నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి.శోభన్ బాబు కృష్ణుడుగా, అర్జునుడుగా కృష్ణ, కర్ణుడిగా కృష్ణంరాజు నటించిన కురుక్షేత్రం మూవీని కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించారు. 1977జనవరి 14న ఈ మూవీ రిలీజయింది. మంచి ఓపెనింగ్స్ వచ్చినా , పెద్దగా ఆడలేదు. కథనంలో ఇంకా పట్టు ఉంటె బాగుండేదని అనిపిస్తుంది.
కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ కృష్ణార్జునులు. జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ మూవీ 1982లో రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది 1984లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఇద్దరు దొంగలు మూవీలో కృష్ణ, శోభన్ బాబు కల్సి నటించారు. రాధ, జయసుధ హీరోయిన్స్ గా నటించారు. రావుగోపాలరావు, సత్యనారాయణ, శారద,తదితర తారాగణం. కైకాల సత్యనారాయణ సోదరుడు నిర్మించిన ఈమూవీ మంచి విజయాన్ని అందుకుంది.