MoviesTollywood news in telugu

రూటు మార్చిన తరుణ్…సక్సెస్ అవుతాడా…కష్టమేనా…?

Tollywood Hero Tarun :నువ్వేకావాలి వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పాటు పలు హిట్ చిత్రాలలో నటించి ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లవర్ బాయ్ తరుణ్ ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, వ్యాపారాలలో బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు సినిమా రంగంలో రూటు మార్చి అడుగుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే తల్లి రోజారమణి బాటలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు.

మలయాళం లో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన అతిరన్ ని తెలుగులో అనుకోని అతిధి పేరిట డబ్బింగ్ చేశారు. ఈ మూవీలో హీరో పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. అతడి తల్లి కూడా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా రాణించి, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతోమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.

తరుణ్ కూడా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి,హీరోగా మంచి కెరీర్ సాగిస్తున్న తరుణంలో వరుస ప్లాప్ లు వెంటాడంతో ‘ఇది నా లవ్ స్టోరీ’ మూవీ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో కన్పించలేదు. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతాడా, మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి.