వరుణ్ తేజ్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Gaddalakonda ganesh movie mirnalini ravi :సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్ గా ఉన్నారు. కొందరు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరికొందరు అరుదైన ఫోట్లు షేర్ చేస్తూ ఆడియన్స్ మదిని దోస్తున్నారు. తాజాగా హీరోయిన్ మృణాళిని రవి తన చిన్ననాటి ఫోటో ఇంస్టా గ్రామ లో పోస్ట్ చేయడంతో లాక్ డౌన్ సమయంలో ఎలా ఉన్నారు అంటూ కాప్షన్ కూడా పెట్టింది.
ఈ ఫోటో వైరల్ కావడంతో చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ ఫాన్స్ మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా మూవీలో మృణాళిని హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఎనిమీ అనే మూవీలో చేయడానికి కూడా పచ్చజెండా ఊపిందని టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్ రోల్ కావడంతో మృణాళిని అనుకున్న గుర్తింపు రాలేదు. ఈ మూవీని డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించాడు. ఇక తెలుగులో మంచి ఆఫర్స్ వస్తాయన్న ఉద్దేశ్యంతో మేనేజర్ ని కూడా అపాయింట్ చేసుకుంది. కానీ అనుకున్న మేరకు ఆఫర్స్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తున్న మృణాళినికి అక్కడ బాగానే ఛాన్స్ లు వస్తున్నాయి. :