ప్రేమ దేశం అబ్బాస్ ఏ దేశంలో ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు..?
Tollywood hero Abbas :ఒకపుడు హీరో అబ్బాస్ అంటే యూత్ లో క్రేజ్. అతడి హెయిర్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. ఏ సెలూన్ లో చూసినా అబ్బాస్ హెయిర్ స్టైల్ కన్పించేది. ఇప్పటికీ చాల చోట్ల సెలూల్స్ లో ఇది కన్పిస్తుంది. అంతలా యూత్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న అబ్బాస్ వాస్తవానికి ప్రేమదేశం మూవీతో స్టార్ హీరో గా ముద్రపడ్డాడు.
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అబ్బాస్ సడన్ గా మాయమయ్యాడు. తమిళం నుంచి వచ్చినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే హార్పిక్ యాడ్ తో బుల్లితెరపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన అబ్బాస్ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందో ఒకసారి పరిశీలిస్తే, రిచ్ లుక్ ఉన్న అబ్బాస్ మాస్ ఆడియన్స్ కి దగ్గరకాలేదు. అలాగే అతడి వాయిస్ కూడా ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు.
కాగా మల్టీస్టారర్ మూవీస్ అందునా పెద్ద హీరోలతో చేయడం వలన క్రెడిట్ అతడికి దక్కాల్సిన స్థాయిలో దక్కలేదు. పెద్ద డైరెక్టర్స్ నుంచి పిలుపు వచ్చిందే తడవుగా ఒకే చెప్పేసి, తనకు సూటవ్వని పాత్రలు చేసి, కెరీర్ పాడుచేసుకున్నాడు. అందుకే ఎక్కువకాలం నిలదొక్కుకోలేక కనుమరుగయ్యాడని అంటారు.
ప్రస్తుతం ఈయన ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అబ్బాస్ ఇండియాలో లేరు.. న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. అక్కడే జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు.
ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా మారిపోయారు. ఇది కూడా ఓ ఉద్యోగమే. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఇదే చేస్తున్నారు ఈయన. మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తూ.. ఎవరికి ఏ సలహాలు కావాల్సినా కూడా తనదైన శైలిలో అందిస్తున్నారు అబ్బాస్.