ఎన్టీఆర్,బాలయ్య కల్సి నటించిన మూవీస్ ఎన్ని ఉన్నాయో…!?
Ntr and his son balakrishna combination movies :తెలుగు తెరపై విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా వెలుగొందిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన నటవారసుడిగా బాలకృష్ణ అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి తండ్రితో కల్సి బాలయ్య పలు సినిమాల్లో నటించాడు. వాటి వివరాల్లోకి వెళ్తే, మొదటగా తాతమ్మకల మూవీని ప్రస్తావించాలి. 1974లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డైరెక్షన్ లోనే వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య తొలిసారిగా నటించాడు. ఆతర్వాత అన్నదమ్ముల అనుబంధం మూవీలో ఎన్టీఆర్ తమ్ముడిగా బాలయ్య నటించాడు. ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
వేములవాడ భీమకవి మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య నటించాడు. పైగా టైటిల్ రోల్ కావడం విశేషం. ముచ్చటగా మూడో సినిమాగా వచ్చిన ఈ మూవీ కూడా విజయాన్ని అందుకుంది. అక్బర్ సలీం అనార్కలి మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య సలీం పాత్ర వేసాడు. ఎన్టీఆర్ అక్బర్ గా నటించారు. అయితే ఈ మూవీ పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అలాగే ఎన్టీఆర్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ దుర్యోధన, శ్రీకృష్ణ, కర్ణ ఇలా మూడు పాత్రలు అవలీలగా పోషిస్తూ తెరకెక్కించిన దాన వీర సూర కర్ణ మూవీలో అభిమన్యుడు పాత్రలో బాలయ్య తన నటనతో మెప్పించాడు.
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య నటించాడు. ఈ సినిమా బాగానే ఆడింది. అలాగే శ్రీ వెంకటేశ్వర మహత్యం మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య నారద పాత్రలో మెప్పించాడు. అనురాగదేవత మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య నటించాడు. ఇది బాగానే ఆడింది. అయితే ఆతర్వాత వచ్చిన సింహం నవ్వింది మూవీలో ఎన్టీఆర్, బాలయ్య కల్సి నటించినా, ఈ మూవీ డిజాస్టర్ అయింది.
ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక విడుదలైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర మూవీలో టైటిల్ రోల్ ఎన్టీఆర్ వేయగా, సిద్ధయ్య పాత్రలో బాలయ్య రాణించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉండగానే తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో ఎన్టీఆర్ తో కల్సి బాలయ్య నటించాడు. ఇది డిజాస్టర్ అయింది.