సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కాని అలనాటి హీరోయిన్లు
Tollywood senior actresses second innings :హీరోయిన్ గా సక్సెస్ అందుకుని, పెళ్లయ్యాక విరామం ప్రకటించి, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్ తో దూసుకెళ్లిన స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అందుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించలేకపోతున్నారు.
మొదటి నుంచి సాంప్రదాయ రోల్స్ లో నటిస్తూ, లెజెండ్ మూవీ నుంచి సితార క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. వరుస విజయాలను అందుకుంటూ, అది సాయి కుమార్ మూవీ జోడీ సినిమా తర్వాత గత ఆరేళ్లుగా ఎక్కడా కన్పించడం లేదు. అలాగే ఒకప్పుడు మత్తుకళ్లతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నిరోషా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ సాధించలేకపోయింది.
మామగారు, బ్రహ్మ మూవీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ వచ్చింది. దేవదాసు, ఓ బేబీ తర్వాత కన్పించడం తగ్గింది. స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గౌతమి మనసంతా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. మంచి పాత్రలలో కనిపిస్తూ వచ్చిన గౌతమి మళ్ళీ మెల్లిగా తగ్గుతూ వచ్చింది.