బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇంటి విలువ తెలుసా ?
Ajay devagan buys New bungalow Cost :సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ల గురించి ప్రతి చిన్న సంఘటన ఈజీగా వైరల్ అవుతుంది. జనానికి ఇలాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ కూడా ఎక్కువే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇంటి గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో కొంగలు చేసిన ఈ బంగ్లా ఖరీదు 60కోట్ల రూపాయలు ఉంటుందని టాక్.
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవగన్ కీలక పాత్ర వేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ లో బాలీవుడ్ తో పాటు వివిధ భాషల నటులు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం ముంబైలో అజయ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోనే తీసుకున్న ఈ బంగ్లా దాదాపు 590చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. కపోలే కో ఆపరేటివ్ సొసైటీ నుంచి 2020 చివరిలోనే ఈ బంగళాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆమధ్య బిగ్ బి అమితాబ్ బచ్చన్ 31కోట్ల రూపాయల భవంతి కొనుగోలు చేయగా, అర్జున్ కపూర్ కూడా ఈమధ్య ఓ ప్లాట్ కొన్నట్లు వార్తలొస్తున్నాయి.