ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా…ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో…?
Telugu Heroine pranitha husband nithin raju :పలు సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బాపు బొమ్మ లాంటి ప్రణీత కరోనా సమయంలో ఎంతోమందికి సేవలందించి వార్తల్లో నిల్చింది. అంతేకాదు, ఈ కరోనా సమయంలోనే పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి మాత్రం ఫాన్స్ కి తెలీకుండా సీక్రెట్ గా జరిగిపొయింది. దాంతో ఇది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
అంతేకాదు, పెళ్లి తర్వాత సినిమాల్లో ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా నడుస్తోంది. అలాగే ప్రణీత భర్త ఏం చేస్తాడు, అతడి ఆస్తులు ఎన్ని వంటి వాటిపై కూడా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె భర్త పేరు నితిన్ రాజు. ఏమాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. అయితే ఇతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయట.
స్కూల్ డీ హాస్పిటాలిటీ కాలేజీలో చదువుకున్న యితడు హాస్పిటల్ మేనేజ్ మెంట్ లో ఉన్నత చదువు పూర్తిచేసాడు. బ్లూ హారిజన్ పేరిట హోటల్స్ పెట్టి హోటల్ రంగంలో రాణిస్తున్న నితిన్ రాజు లాభాల బాటలో హోటల్స్ రన్ చేస్తున్నాడని, మంచి డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడని టాక్.