టీచర్ పాత్రలో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే…!?
Tollywood Heroines lecturer Role :తెలుగులో చాలామంది హీరోయిన్స్ టీచర్ పాత్రలో మెప్పించారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై టి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లెక్చరర్ పాత్రలో మెప్పించింది. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అయితే సినిమాల్లోకి సెకండ్ ఇన్నింగ్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె సరిలేరు నీకెవ్వరూ మూవీలో కూడా లెక్చరర్ పాత్రనే వేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో హీరోగా చేయగా, రష్మిక మందన్న హీరోయిన్.
అలాగే సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా ఆరాధన సినిమాలో టీచర్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసాడు. ఇక రమ్యకృష్ణ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో టీచర్ గా చేసింది. నేనే అంబానీ మూవీలో నయనతార టీచర్ గా చేయగా, సీమ రాజా మూవీలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా చేసింది.
వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ మూవీలో ఆసిన్, రవితేజ హీరోగా వచ్చిన ఖతర్నాక్ మూవీలో ఇలియానా, హ్యాపీడేస్ మూవీలో కమిలిని ముఖర్జీ, ప్రేమమ్ మూవీలో శృతిహాసన్, రాక్షసుడు మూవీలో అనుపమ పరమేశ్వరన్ టీచర్ పాత్రల్లో రాణించారు.