MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో గ్రేట్ ఫ్యామిలీ ఎవరు ?

Tollywood Heroes :ఒకప్పటి కంటే ఇప్పుడు సినిమాల్లో వారసత్వం తారాస్థాయికి చేరింది. దీంతో నాలుగైదు ఫ్యామిలీస్ హవా నడుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఐదుగురు, నందమూరి ఫ్యామిలీ నుంచి నలుగురు, దగ్గుబాటి, ఘట్టమనేని హీరోలు కలిపి నలుగురు ఉన్నారు. ఇక స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా డజనుమంది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.

మిగతా ఫ్యామిలీలతో పోలిస్తే, మెగా ఫ్యామిలీ కొంచెం స్టాండర్డ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కారణం మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరూ సమైక్యంగా ఉండడం ప్రధాన కారణంగా చెబుతారు. లోపల ఏదైనా ఉండొచ్చు పైకి మాత్రం యూనిటీ గా ఉన్నట్లు చాటిచెబుతున్నారని విశ్లేషకుల అంచనా. ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా యూనిటీ చాటుతున్నారు.

అలాగే అక్కినేని ఫ్యామిలీలో కూడా ఒకరి సినిమాలకు మరొకరు ప్రమోట్ చేసుకోవడం కన్పిస్తోంది. ఇక దగ్గుబాటి హీరోలు కూడా పర్వాలేదు. అయితే నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని, పైగా ఇది బహిరంగ రహస్యమని విశ్లేషకుల అంచనా. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకరికొకరు తోడుగా ఉన్నా, బాబాయ్ బాలయ్య కొంచెం దూరంగా ఉంటున్నట్లు ఇప్పటిమాట కాదు. ఎప్పటినుంచో విన్పిస్తున్న టాక్. ఇప్పటికైనా నందమూరి హీరోలు కల్సి ఒక సినిమా చేసి విబేధాలు లేవని చాటుతారని నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.