జంట కాబోతున్న మోనాల్ అఖిల్…నమ్మటం లేదా…చూడండి
Akhil sarthak and monal gajjar web series :బిగ్ బాస్ షో తో సందడి చేసిన మోనాల్,అఖిల్ జంట ఆ మధ్య ప్రేమికుల రోజు సందర్బంగా తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి పేరిట వెబ్ సిరీస్ లో కల్సి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ మధ్య ఆ వెబ్ సిరీస్ ఊసేలేదు. దీంతో అసలు ఇది వస్తుందా రాదా ఆగిపోయిందా వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈనేపధ్యంలో అఖిల్ సార్థక్ స్పందిస్తూ, ఎవరికి వాళ్ళం బిజీగా ఉండడంతో డేట్లు కుదరడం లేదని, డేట్స్ కుదిరిన వెంటనే ఈ వెబ్ సిరీస్ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫస్ట్ టైం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో అఖిల్ సరసన అనిక విక్రమన్ నటిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు పూర్తయ్యాక వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక బిగ్ బాస్ షోలో అఖిల్, మోనాల్ జంట చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తోందా అన్నట్లుగా గుసగుసలు విన్పించాయి. నిజంగా వీరిద్దరి మధ్యా స్నేహమా, ప్రేమ వ్యవహారం నడుస్తోందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.