శుభలేఖ సుధాకర్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా?
Tollywood Actor subhalekha sudhakar :సినిమా పేరునే ఇంటిపేరుగా పొందిన నటులు,రచయితలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇందులో శుభలేఖ సుధాకర్ ఒకరు. ఈయన చిరంజీవి హీరోగా నటించిన శుభలేఖ మూవీలో నటించడం ద్వారా ఆ సినిమాయే ఇంటిపేరుగా ఫామ్ లోకి వచ్చాడు. నిజానికి సినిమాల్లో నటించడం అంటే మొదట్లో అతడి ఇంట్లో వాళ్లకు అసలు ఇష్టం లేకపోవడంతో శుభలేఖ సుధాకర్ సినిమా ఎంట్రీ కూడా విచిత్రంగా జరిగింది.
సుధాకర్ కి సినిమాలు అంటే చాలా ఇష్టం. బిగ్ బి అమితాబ్ నటించిన దీవార్ మూవీ చూసాక ఇండస్ట్రీలోకి రావాలన్పించింది. దాంతో ఇంట్లో వాళ్ళను ఒప్పించి మద్రాసు వెళ్లి, ఫిలిం ఇనిస్టిట్యూలో శిక్షణ తీసుకున్నాడు. యాక్టింగ్ లో డిప్లొమా అవ్వడంతో కళాతపస్వి కె విశ్వనాధ్ ని విశాఖ లో కల్సి విషయం చెప్పాడు. అప్పటికే సప్తపది మూవీ విశ్వనాధ్ చేస్తున్నారు. కానీ ఛాన్స్ రాలేదు. దాంతో మద్రాసు వెళ్లి ట్రై చెయ్యాలని భావించి, ఇందుకు డబ్బు కావాలి కనుక ఓ హోటల్ లో ఉద్యోగం సంపాదించాడు.
సెలబ్రిటీలు,ప్రముఖులు బసచేసే తాజ్ కోరమాండల్ హోటల్ లో ఉద్యోగంలో చేరి, సినిమా ట్రైల్స్ స్టార్ట్ చేసాడు. అదే సమయంలో విశ్వనాధ్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. శుభలేఖ చిత్రంలో ఛాన్స్ దక్కింది. దివంగత గాయకుడూ ఎస్పీ బాలు సోదరి ఎస్పీ శైలజను వివాహమాడిన శుభలేఖ సుధాకర్ ఎన్నో సినిమాల్లో వివిధ క్యారెక్టర్స్ వేసాడు. హాస్య పాత్రలతో నవ్వించాడు. తర్వాత మెల్లిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. సినిమాల్లో కూడా నటన సాగిస్తున్న శుభలేఖ సుధాకర్ ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా వచ్చిన ద్రోహి మూవీలో నెగెటివ్ రోల్ కూడా వేసి మెప్పించాడు. ఓపక్క బుల్లితెర, మరోపక్క వెండితెరపై తన నటన సాగిస్తున్నాడు.