ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ కు సమంత రెమ్యునరేషన్…!?
Samantha remuneration for family man web series :కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ సైతం కుదేలైంది. థియేటర్లు మూతపడడంతో ఇళ్లకు పరిమితమైన జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. దాంతో సీరియల్స్ తో పాటు రియాల్టీ షోస్ కి అలాగే ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. ఓటిటి లో సినిమాలు రిలీజ్ కావడంతో పాటు వెబ్ సిరీస్ వస్తున్నాయి. స్టార్ హీరోలు,హీరోయిన్స్ సైతం వెబ్ సిరీస్ వైపు మొగ్గుతున్నారు. ఇప్పటికే ఆహా ఓటిటి లో స్టార్స్ ఇంటర్యూ పేరిట అక్కినేని వారి కోడలు సమంత పాపులర్ అయింది.
దానికి తోడు వెబ్ సిరీస్ లో సైతం సమంత చేస్తోంది. తాజాగా హాలీవుడ్ స్థాయిలో తీసిన ఫ్యామిలీ 2వెబ్ సిరీస్ లో నటించినందుకు గాను సామ్ ఏకంగా మూడున్నర కోట్లు తీసుకుందని టాక్. పైగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కి ముందు సమంత పాత్ర పై వివాదం ఏర్పడడం కూడా బాగా కల్సి వచ్చింది. ఇందులోనే నటించిన హీరోయిన్ ప్రియమణి 80లక్షలు తీసుకుందట.
ఈ ఏడాది అమెజాన్ ప్రయిమ్ లో వచ్చిన ఫామిలీ 2వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన నటీనటులకు తక్కువ మొత్తం ఇచ్చినప్పటికీ సమంతకు బాగానే ముట్టింది. సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ లో సైతం రెమ్యునరేషన్ దక్కడం విశేషం.ఇక ఇందులో నటించిన మనోజ్ బాజ్ పాయ్ ఏకంగా 10కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వినిపిస్తోంది.