ప్రియదర్శి భార్య ఏమి చేస్తుందో తెలుసా..?
Telugu comedian Priyadarshi :కమెడియన్ ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లి చూపులు సినిమా తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాకి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు పెళ్లి చూపులు సినిమా తర్వాతే వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రియదర్శి రీచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఆమె ప్రియదర్శి కి చాలా సపోర్ట్ చేసిందట మొబైల్, ట్రావెల్ ఖర్చులు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇలా అన్ని రకాలుగా భార్య చాలా సహకారం అందించిందని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. అసలు ప్రియదర్శి భార్య రిచా శర్మ ఏం చేస్తుందో తెలుసా…రీచా శర్మ నవలా రచయిత్రి. ఆమె అనేక నవలలు రాసినట్లు సమాచారం. ప్రియదర్శి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.