MoviesTollywood news in telugu

A.R.రెహ్మాన్ మాస్క్ ఖరీదు తెలిస్తే షాకవుతారు

A.R.Rehman Mask Cost :టాలీవుడ్,కోలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ అందుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సైతం గెలుచు కున్నాడు. ఒక్కో సినిమాకు 5కోట్ల రూపాయల దాకా రెమ్యునరేషన్ తీసుకునే సంగీత దర్శకుడు సౌత్ లో ఇతడొక్కడే.ఇక రెమ్యునరేషన్ భారీగా అందుకునే సెలబ్రిటీలు వాడే వస్తువులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

కొందరు హీరో హీరోయిన్స్ వాడే వస్తువుల రేట్లు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. వాచీలు,బ్యాగ్ లు,కారులు, బైక్ లు ఇలా అన్నీ ఖరీదైనవే ఉంటాయి. ఇక కరోనా సమయంలో వాడుతున్న మాస్క్ లు,ఫేస్ షీల్డ్ లు కూడా ఖరీదుగానే ఉంటున్నాయి. కొందరైతే ప్రత్యేకించి మాస్క్,ఫేస్ షీల్డ్ లు డిజైన్ చేయించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ వాడుతున్న మాస్క్ గురించి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. మాస్క్ ఖరీదు రూ 10 నుంచి రూ1000 వరకూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రూ 5000 ఉండొచ్చు. కానీ రెహ్మాన్ వాడే మాస్క్ ఖరీదు రూ 12వేలట.