అమెరికాలో షూటింగ్ చేసిన తొలి తెలుగు సినిమా ఇదే
Hare Krishna Hello Radha full Movie : ఇప్పుడంటే విదేశాల్లో ఎక్కువ సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి కానీ, ఒకప్పుడు ఫారిన్ వెళ్లి షూటింగ్ చేయడం అంటే గగనమే. అయితే తెలుగులో కలర్, స్కోప్, 70ఎం ఎం వంటి ఎన్నో సాంకేతిక విలువలను ప్రవేశపెట్టడమే కాకుండా విభిన్న తరహా పాత్రలతో రక్తికట్టించిన సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ముద్రపడ్డారు. ఎందుకంటే, సినిమాల కోసం ఆయన సాహసాలు చేసారు.
ఇక అప్పట్లో అమెరికాలో షూటింగ్ నిర్వహించిన ఘనత కూడా కృష్ణ దే. 1980లో తీసిన హరే కృష్ణ హలో రాధ మూవీ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీ 90శాతం షూటింగ్ పూర్తయ్యాక,కథను కొంచెం మార్పు చేసి,అమెరికాలో షూటింగ్ కి రెడీ అయ్యారు.
లాస్ ఏంజెల్స్, శాంతా మోనికా బీచ్, శాండియాగో బీచ్,ఫీనిక్స్,లాస్ వేగాస్ తదితర ప్రాంతాల్లో పాటలు,కొన్ని సీన్స్ తీశారు. ఫీనిక్స్ లో గుర్రాల ఆట సీన్స్ తీశారు. ఎవరూ లొంగదీయని గుర్రాన్ని హీరో లొంగదీసే సీన్ అక్కడే తీశారు. ఇక గ్రాండ్ కాన్యన్ లో క్లైమాక్స్ తీశారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కూడా ఒకేసారి తీశారు. ఈ సినిమా మంచి హిట్ అయింది.