తమన్నా తన బాధలను ఏ హీరోయిన్ తో షేర్ చేసుకుంటుందో తెలుసా ?
Telugu actress tamanna : మామూలు ఫ్రెండ్స్ మాదిరిగానే స్టార్ హీరోయిన్స్ కి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. తమ కష్ట సుఖాలు, బాధలు అన్నీ షేర్ చేసుకుంటారు. మిల్కి బ్యూటీ తమన్నా కు మంచి ఫ్రెండ్ ఉంది. అది ఎవరో కాదు, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. తనకు ఏదైనా బాధ కలిగినపుడు శృతికి ఫోన్ చేస్తానని తమన్నా ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది. ఇక శృతి హాసన్ తో చాలా రోజుల నుంచి ఫ్రెండ్ షిప్ చేస్తోంది.శృతికి ఫోన్ చేస్తే బాధ మర్చిపోయి,ఆనందం కలుగుతుందని,తమన్నా చెప్పింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా శృతి యాక్టివ్ గా ఉంటుందని తెల్పింది.
శృతి ఎప్పుడూ సరదాగా ఉంటుందని, ముఖ్యంగా శృతి తన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటుందని తమన్నా చెప్పింది. పైగా శృతి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని, అసలు అలా ఉండడం ఎలా సాధ్యమో తనకు అర్ధం కాదని తమన్నా కొంచెం ఆశ్చర్యంగా చెప్పింది.