అల్లరి ప్రేమికుడు హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?
Telugu heroine Kanchan :కొందరు చేసిన సినిమాలు ఒకటి రెండు అయినా బాగా గుర్తిండిపోతారు. అందులో హీరోయిన్ కాంచన్ ఒకరు. ఈమె సీమ అనే బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు సరికదా,ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. దాంతో ఈమెకు ఛాన్స్ లు రాలేదు.
పైగా పదేళ్ల నిరీక్షణ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన సనం బేవఫా మూవీ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ మూవీ హిట్ అయినప్పటికీ ఈ భామకు తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. అయినా సరే కొన్ని ఛాన్స్ లు వచ్చాయి. సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోవడం వలన ఈమె నటించిన మూవీస్ ఫెయిల్యూర్ అయ్యాయి.
హిందీ,తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో నటించిన ఈ అమ్మడు 2002లో గంగూభాయ్ మూవీ ఒప్పుకున్నా అది షూటింగ్ స్టార్ట్ కాలేదు.దీంతో ఈమె ఎక్కడ ఎలా ఉంటూ తెలీడం లేదు.ఇక జగపతి బాబు హీరోగా అల్లరి ప్రేమికుడు మూవీ గుర్తుండే ఉంటుంది. అందులో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా జోగేశ్వరి దేవి పాత్రలో అలరించి, ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే లక్కీ ఛాన్స్, ప్రేమపుస్తకం వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.