ఆట-5 విన్నర్ గీతిక ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Aata 5 winner Geethika :బుల్లితెరపై రియాల్టీ షోస్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఒకప్పుడు జి తెలుగులో ఆట డాన్స్ రియాల్టీ షో కూడా బాగా ఆకట్టుకోవడంతో పాటు మంచి టిఆర్పి రేటింగ్ సాధించింది. చాలామంది ఈ షో ద్వారా డాన్స్ లతో అదరగొట్టి ఆడియన్స్ మన్ననలు పొందారు. ఇందులో అతి చిన్న వయస్సులోనే తన డాన్స్ తో అలరించి, విన్నర్ గా నిలిచిన ఘనత గీతికకు వర్తిస్తుంది.
ఆట -5 జూనియర్ పోటీలలో పాల్గొన్న గీతిక ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ షో తో విన్నర్ గా నిలవడమే కాకుండా చిన్న వయస్సులోనే సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కారా మజాకా వంటి సినిమాలో నటించింది. ఇందులో కళ్యాణి,ఆలీ,సంగీత తదితరులు నటించారు. తర్వాత పలు సినిమాలు,సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. తెలుగు,తమిళ,కన్నడ భాషా చిత్రాల్లో నటించిన గీతిక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అంశాలు వెల్లడించింది.
తనకు సంబందించిన విషయాలను షేర్ చేసుకుంటోంది. 2012లో ఓ ప్రోగ్రాం లో పాల్గొని వస్తుండగా, ప్రమాదం జరిగి, ఎడమ కాలుకి,చేయికి గాయాలు అయ్యాయట. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న గీతిక ఇప్పటికీ డాన్స్ అంటే మక్కువ కనబరుస్తోంది. డాన్స్ తన రక్తంలోనే ఉందని,ఏ ఛాన్స్ వచ్చినా నటించడానికి సిద్ధమని చెప్పింది.