MoviesTollywood news in telugu

త్రినయని సీరియల్ జాస్మిన్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Trinayani serial jasmine real life :తెలుగు ఛానల్స్ లో సీరియల్స్ కి కొదవలేదు. పోటాపోటీగా వస్తున్న సీరియల్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే జి తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ స్టార్ట్ అయిన కొన్నాళ్లకే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇందులోని నటీనటులు బాగా ఆకట్టుకుంటున్నారు. నెగెటివ్ రోల్ లో నటిస్తూ ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్న జాస్మిన్ రియల్ లోకి వెళ్తే, ఈమె అసలు పేరు ప్రియాంక శర్మ.

ప్రియాంక నవంబర్ 4న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించింది. విజయవాడలో స్కూల్ విద్య, డిగ్రీ హైదరాబాద్ లో పూర్తిచేసింది. సహజంగా అందంగా ఉండడం,యాక్టింగ్ పై మక్కువ ఉండడంతో పాటు స్కూల్ డేస్ లోనే టీచర్స్, ఫ్రెండ్స్ కూడా ఈమెను హీరోయిన్ గా ట్రై చేయమని ప్రోత్సహించారట.దాంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంది. ఈమెకు పెయింటింగ్ అంటే మక్కువ.

ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి పేరెంట్స్ ససేమిరా అన్నారట. అయితే కొన్నాళ్ల తర్వాత తల్లి ఎంకరేజ్ మెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియాంక శర్మ మన వూరిలో మన ప్రేమకథ,శివకాశిపురం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అదే సమయంలో సీరియల్స్ లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా ఈటీవీలో అభిషేకం సీరియల్ తో టివి రంగంలో అడుగుపెట్టి, నెగెటివ్ రోల్ తో ఆకట్టుకుంటోంది. రోజా అనే సీరియల్ లో కూడా చేసింది. అభిషేకం తో పాటు రెండురెళ్ళు ఆరు,త్రినయని సీరియల్స్ లో చేస్తోంది.