MoviesTollywood news in telugu

అక్షయ కుమార్ ఆగిన సినిమాల విలువ ఎన్ని కోట్లో తెలుసా ?

akshay kumar movies :కరోనా దెబ్బకు అన్ని రంగాలు మాదిరిగానే సినిమా రంగం కూడా ఘోరంగా దెబ్బతింది.ఇప్పటికీ పూర్తిస్థాయిలో షూటింగ్స్ జరగడం లేదు. థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో చాలామంది హీరోల సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోగా,మరికొన్ని సినిమాలు పూర్తయినా రిలీజ్ కి నోచుకోవడం లేదు.

ఇక బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్ లను తట్టుకుని తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అయితే ఎంతలేదన్నా 200కోట్ల కలెక్షన్ వస్తుంది. అక్షయ్ నటించిన 4 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. మరో రెండు సినిమాలు పూర్తికావాల్సి ఉంది.

ఈ లెక్కన అక్షయ్ సినిమాల రిలీజ్ కాకపోవడం వలన కనీసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ ఆగిపోయిందని అంచనా. కొంతమంది ప్రొడ్యూసర్స్ థియేటర్లు ఎప్ప్పుడు తెరుస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, మరికొందరు ప్రొడ్యూసర్స్ ఎంతోకొంత కలెక్ట్ చేసుకోడానికి ఓటిటి లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.