దేవత సీరియల్ దేవుడమ్మ భర్త ఎవరో తెలుసా…ఏమి చేస్తారో…?
Devatha serial devudamma real life :టివి ఛానల్స్ లో సీరియల్స్ బాగా రన్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా మాటీవీలో విజయవంతంగా నడుస్తున్న దేవత సీరియల్ లో నటీనటులు తమ అందంతో,అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. అందుకే స్టార్ట్ అయిన కొన్నాళ్లకే మంచి ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో దేవుడమ్మగా నటిస్తున్న అనిలా శ్రీకుమార్ తన నటనతో అలరిస్తోంది.
అనిలాకు చిన్న నాటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండేది. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. డాన్స్ మీద మక్కువతో నేర్చుకుని కొన్ని స్టేజ్ షోస్ లో పాల్గొని పలువురి మన్ననలు అందుకుంది. ఈమె భర్తపేరు శ్రీకుమార్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కల్సి జోడిజన్ అల్టిమేట్ డాన్స్ షోలో కూడా ఈమె పాల్గొంది. అయితే డాన్స్ షోస్ ఎన్ని ఇచ్చినా తగిన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.
ఆవిధంగా తమిళంలో ఓ సీరియల్ లో నటిస్తోంది. ఇది తెలుగు మౌనరాగం సీరియల్ కి రీమేక్. ఇందులో అమ్ములకి తల్లిగా అనిలా నటిస్తోంది. తెలుగులో తొలిసారిగా దేవత సీరియల్ లో దేవుడమ్మగా నటిస్తోంది. తెలుగులో మొదటి సీరియల్ అయినప్పటికీ తన నటనతో ఫాన్స్ ని సొంతం చేసుకుంది. సీరియల్స్ లో ట్రెడిషనల్ లుక్ తో కనిపించినప్పటికీ బయట ఫ్యాషన్ గా కన్పించడం విశేషం.