MoviesTollywood news in telugu

యాంకర్ శ్యామల లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…!?

Telugu Anchor Shyamala LifeStyle :తెలుగులో సుమ తర్వాత ఆ రేంజ్ లో ఇప్పుడు దూసుకుపోతూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ ఎవరంటే శ్యామల అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఈవెంట్ కి 50వేలు అందుకుంటోంది. ఈమె ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 1989నవంబర్ 5న జన్మించింది. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో చదివిన ఈమె శ్రీ సాయి ఆదిత్య కాలేజీలో స్టడీస్ పూర్తిచేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 32ఏళ్లకు చేరుతోంది. యాంకర్ నరసింహాతో 2012లో శ్యామలకు పెళ్లయింది. 2017లో వీరికి పుట్టిన బిడ్డకు ఇషాన్ అనే పేరు పెట్టారు.

ఇక చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన శ్యామల ను తల్లి పెంచి పెద్ద చేసారు. స్కూల్ డేస్ లో స్టేజ్ నాటకాల్లో పాల్గొన్న శ్యామల ఇంటర్ పూర్తయ్యేక సమ్మర్ హాలిడేస్ లో సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెల్సి పాల్గొంది. అందులో ఛాన్స్ రాకపోయినా, లయ అనే సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. జి తెలుగులో హ్యాపీ డేస్, ఈటీవీలో అభిషేకం, జెమినిలో గోరింటాకు, జగదేక వీరుడు అతిలోక సుందరి సీరియల్స్ లో నటించింది. అంతేకాదు,మా ఊరి వంట ప్రోగ్రాంలో యాంకర్ గా చేసింది.

ఇక గాయం 2మూవీ ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేసాక వరుసగా ఆఫర్స్ వచ్చాయి. గుండెల్లో గోదారి, లౌక్యం, ఒక లైలా కోసం, బెంగాల్ టైగర్ వంటి మూవీస్ లో నటించింది. అంతేకాదు,బిగ్ బాస్ రియాల్టీ షోలో సెకండ్ సీజన్ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది. గచ్చిబౌలి లోని క్రిస్టల్లో అపార్ట్ మెంట్స్ లో కోటి 80లక్షల విలువైన ప్లాట్ లో నివాసం ఉంటోంది. ఇదిగాక మరో విల్లా కడుతోంది. రెండు కారులు,రెండు బైక్స్ ఉన్నాయి. మటన్ బిర్యానీ అంటే శ్యామలకు ఇష్టం. కేరళలోని వేనాడ్ ఇష్టమైన ప్రదేశం. నాగార్జున,సావిత్రి,రమ్యకృష్ణ అంటే ఇష్టం. ఏం చెప్పారు శ్యామల గారు యూట్యూబ్ ఛానల్ కి 2లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.