ఈ విలన్ ని గుర్తుపట్టారా…ఎన్ని కోట్ల ఆస్తి ఉందో…?
Tollywood Acctor vallabhaneni janardhan :గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా నటించిన వల్లభనేని జనార్ధన్ గుర్తున్నారా. ఆ సినిమాలో దుష్ట ఎస్పీ పాత్రను పోషించారు. ఈ తరం వారికి జనార్ధన్ అంటే తెలీదు ఎందుకంటే ఈయన సినిమాలు మానేసి చాలా కాలం అయ్యింది. ఈయన చాలా మంచి పాత్రలను పోషించారు. గ్యాంగ్ లీడర్ సినిమా లో చిరంజీవి వదినగా నటించిన హీరోయిన్ సుమలత తండ్రి పాత్రలో నటించారు
లంచగొండి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. గ్యాంగ్ లీడర్ సినిమాకి ముందు కొన్ని సినిమాలు చేసినా గ్యాంగ్ లీడర్ సినిమా మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది అలాగే గుర్తింపును కూడా తీసుకొచ్చింది. తెలుగులో దాదాపుగా 120 సినిమాలు చేశారు. మొదటగా సినీ పరిశ్రమకు దర్శకత్వ శాఖలో పని చేసి ఆ తర్వాత నటన వైపు వచ్చారు. ఆస్తుల విషయానికొస్తే తన తాత గారు సంపాదించిన ఆస్తులు విలువ అప్పట్లో 400 కోట్ల రూపాయలు ఉంటుందని తాను తన తండ్రి సంపాదించిన ఆస్తి ఎంత ఉంటుందో చెప్పనక్కరలేదని ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.