రూటు మారుస్తున్న జగపతి బాబు…సక్సెస్ అవుతాడా…?
Tollywood Hero Jagapati Babu :కరోనా సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ముందుకి మద్దతు ,తెలపడమే కాదు,ఈ మందు వలన కరోనా రాలేదని కూడా ప్రకటించిన నటుడు జగపతి బాబు ఇప్పుడు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. జగపతి ఆర్ట్స్ అధినేతగా పలు సినిమాలు నిర్మించి దర్శకత్వం వహించిన విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన జగపతిబాబు మొదట్లో హీరోగా మంచి ఫాలోయింగ్ సాధించాడు.
వరుస హిట్స్ తో ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న జగపతి బాబు తర్వాత ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా అవతారం ఎత్తి పలు సినిమాల్లో విలనిజం చూపించి ఆకట్టుకుంటున్నాడు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో దుమ్మురేపాడు. సైరా లాంటి సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం కరోనా సమయంలో ఇండస్ట్రీకి దెబ్బ తగలడంతో జగపతి బాబు వేరే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న యోచన చేస్తున్నాడట.
ముఖ్యంగా ఆయుర్వేద వ్యాపారంలోకి అడుగుపెట్టాలని జగపతిబాబు చూస్తున్నట్లు టాక్. కొంతమందితో కల్సి ఆయుర్వేద ఆసుపత్రి నెలకొల్పడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆసుపత్రి పనులు ప్రారంభ మయ్యాయని, దగ్గరుండి పనులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి జగపతి బాబు డైరెక్టర్ గా ఉంటాడని వినిపిస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నాడన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.