కృష్ణ తులసి ఐశ్వర్య ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
krishna tulasi serial :కృష్ణ తులసి సీరియల్ లో హీరోయిన్ శ్యామ పాత్రలో నటించి మెప్పిస్తున్న ఐశ్వర్య కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఈమె గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో ఆమె పడిన కష్టాలు వెలుగు చూశాయి. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అంశాల వలన ఎంతగా ఇబ్బంది పడిందో అందులో స్పష్టంగా చెప్పుకొచ్చింది.
చిన్నప్పటి నుంచి నటన పట్ల అనురక్తి ఉండడం వలన యాక్టింగ్ వైపు రావాలని అనుకుంటే పేరెంట్స్ ససేమిరా ఒప్పుకోలేదట. ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో ఇక స్వస్తిచెప్పాలని అనుకుని చివరిగా ఓ సారి గట్టిగా ప్రయత్నం చేసింది. మొత్తానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా యాక్టింగ్ సంస్థలో చేరిన ఐశ్వర్య కోర్సు పూర్తిచేసేసింది.
వెంటనే ఛాన్స్ లు రాకపోవడంతో కొన్నాళ్ళు ఖాళీగానే ఉంది. పైగా దాదాపు 50 సార్లు ఆడిషన్స్ కి వెళ్లినా హీరోయిన్ కాకుండా చిన్న రోల్ కి సెలెక్ట్ కావడంతో హీరోయిన్ చేయాలన్న కాంక్షతో ఖాళీగానే ఉండిపోయింది. ఇక లాభం లేదనుకుని కంపెనీ సెక్రటరీ కోర్సు చదవడానికి జాయిన్ అయింది. అదే సమయంలో ఓ సీరియల్ లో ఆడిషన్ జరగడం అందులో సెలెక్ట్ అవ్వడంతో ఇండస్ట్రీకి వచ్చింది.