ఒకప్పటి విలన్,క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొడుకుని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో…?
Giri babu Son Bosu Babu Details :ఒకప్పుడు విలన్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కమెడియన్ గా,దర్శకుడిగా ఇలా ఎన్నో రకాలుగా అలరిస్తూ టాలీవుడ్ లో ఇప్పటికీ వేషాలతో అలరిస్తున్న గిరిబాబు తన ఇద్దరు కుమారులలో పెద్దకుమారుడు రఘుబాబుని ఇండస్ట్రీకి తెచ్చారు.వెండితెరపై కెమెడియన్ గా కామెడీ టైప్ విలన్ గా అలరిస్తున్నాడు.
టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో రఘుబాబు నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే రెండో కుమారుడు బోసుబాబుని హీరోగా చేయాలని గిరిబాబు భావించారు. ఇంద్రజిత్ మూవీ ద్వారా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇప్పించారు. అయితే ఆ సినిమా రిలీజ్ సమయానికి చిరంజీవి కొదమసింహం మూవీ రిలీజ్ కావడంతో ఇంద్రజిత్ సినిమాని సగం ధరకే కొన్నారట.
దానికి తోడు సినిమా కూడా పెద్దగా టాక్ తెచ్చుకోలేదు. పెద్దగానే నష్టం రావడంతో బోసుబాబు కూడా హీరో అవ్వాలన్న విశ్వాసాన్ని కోల్పోయాడు. హిందీలో స్టంట్ మ్యాన్ గా చెమ్మాచెక్కా మూవీలో హీరోగా కనిపించాడు. అయితే ఇవేమీ బోసుబాబు కేరీర్ కి దోహదపడలేదు. దాంతో వెండితెరపై రాణించలేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు.