హీరో తరుణ్ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి ఉందో…?
Tollywood hero Tarun :బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో చేసి, నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకుని,టాలీవుడ్ లవర్ బాయ్ గా గుర్తింపు పొందిన హీరో తరుణ్ ఎన్నో హిట్ మూవీస్ చేసాడు. ఇతడి అసలు పేరు బట్టి తరుణ్ కుమార్. తరుణ్,లవర్ బాయ్ తరుణ్ అని నిక్ నేమ్స్ ఉన్నాయి. 1983 జనవరి 8న చక్రపాణి, రోజా రమణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించిన తరుణ్ వయస్సు 38ఏళ్ళు. హైదరాబాద్ కాండోర్ షరిన్ హైస్కూల్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో చదివాడు. తరుణ్ కి అమూల్య అనే సిస్టర్ ఉంది.
బాలనటుడిగా మనసుమమత మూవీతో టాలీవుడ్ లో తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్య ఐపీఎస్,ఆదిత్య 369, తేజ వంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టుగా తన సత్తా చాటాడు. స్టడీస్ కారణంగా సినిమాలకు దూరమై, కె విజయభాస్కర్ డైరెక్షన్ లో 2000లో వచ్చిన నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 12లక్షల 40వేలు రెమ్యునరేషన్ అందుకున్నాడు. నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు, ఎలా చెప్పను, భలేదొంగలు వంటి సినిమాల్లో చేసాడు. 2018లో ఇది నా లవ్ స్టోరీ మూవీ కి 74లక్షల 50వేలు అందుకున్నాడు.
తరుణ్ కి హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్స్ శ్రేయ,త్రిష అంటే ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. హైదరాబాద్,ఊటీ ఇష్టమైన ప్రదేశాలు. సినిమాలు చూడడం ఇష్టం. ఒక్కో మూవీకి 80లక్షల వరకూ తీసుకునే తరుణ్ నెట్ వర్త్ 70కోట్లు ఉంటుంది. హైదరాబాద్ ఆదిత్య సమ్మిట్ అపార్ట్ మెంట్స్ లో కోటిన్నర విలువైన ప్లాట్ లో తరుణ్ ఉంటున్నాడు. ఇతడి దగ్గర మూడు విలాసవంతమైన కార్లున్నాయి.