గౌరమ్మ సీరియల్ గౌరీ రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?
Gowramma serial actress gowri :తెలుగు సీరియల్స్ మంచి ఆదరణ ఉండడంతో కొత్త కొత్త సీరియల్స్ వస్తున్నాయి. ఈటీవీలో ఇటీవల మొదలైన గౌరమ్మ సీరియల్ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో గౌరీ పాత్రలో నటిస్తున్న నటి తన అందంతో,అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈమె అసలు పేరు శాంభవి గురుమూర్తి.
డిసెంబర్ 26న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శాంభవి తండ్రి పేరు గురుమూర్తి. ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో శాంభవి తన గ్రాడుయేషన్ పూర్తిచేసింది. చిన్ననాటి నుంచి నటనపై గల మక్కువతో తమిళ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. కిల్ల తై వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
వరుస సీరియల్స్ తో శాంభవి తమిళంలో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన మల్లీశ్వరి సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె మజిలీ వంటి సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ప్రస్తుతం ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లిచేసుకోబోతోంది. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో మూవీ లో శాంభవి నటించింది. అలాగే తెలుగు,తమిళ సినిమాల్లో నటించింది.