కమెడియన్ వేణు మాధవ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో…!?
Tollywood comedian venumadhav : మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపుగా 400కు పైగా సినిమాల్లో నటించిన వేణుమాధవ్ 2019 సంవత్సరంలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్ చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటం వలన రవీంద్రభారతిలో చేసిన ఒక కామెడీ స్కిట్ వేణుమాధవ్ జీవితాన్నే మార్చేసింది. ఆ స్కిట్ చూసిన దర్శకుడు సాంప్రదాయం సినిమాలు అవకాశం ఇచ్చారు.
ఆ సినిమాలో 70 వేల రూపాయల పారితోషికం అందుకున్నాడు ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో 20 సంవత్సరాల పాటు బిజీగా కనిపించాడు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. వేణుమాధవ్ చనిపోయిన రెండు సంవత్సరాలు అయినా అభిమానులు ఇంకా మర్చిపోలేదు. వేణుమాధవ్ సంపాదించిన డబ్బును స్థిరాస్తుల రూపంలో పెట్టేసాడు. హైదరాబాదులో దాదాపుగా వేర్వేరు ప్రాంతాల్లో 10 ఇల్లులు ఉన్నాయట. అలాగే కరీంనగర్ కోదాడలో వ్యవసాయ భూములు ఉన్నాయని సమాచారం వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా తనకు వచ్చిన ఆదాయాన్ని చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు.