ఇంటికి దీపం ఇల్లాలు నటి రాశి రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?
Intiki deepam illalu serial actress rashi :తెలుగు టివి సీరియల్స్ కి ఉన్న డిమాండ్, క్రేజ్ నేపథ్యంలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మంచి ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నటించే రాశి తన అందంతో, అభినయంతో టివి జనానికి దగ్గరైంది. అంతేకాదు, వరుస ఆఫర్స్ తో పలు సీరియల్స్ చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న రాశి అసలు పేరు నీమా సింగ్ రాజ్ పుత్.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నర్సంపేటలో ఫిబ్రవరి 5వ తేదీన జన్మించిన నీమా సింగ్ కి ఓ సిస్టర్ ఉంది. చిన్నప్పటి నుంచి నటన,డాన్స్ మీద మక్కువ. దీంతో స్టడీస్ చేస్తూనే,మాటీవీలో పవిత్ర బంధం సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి,పాజిటివ్,నెగెటివ్ రోల్స్ లో నటిస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బిటెక్ అనే మూవీలో కూడా నీమా నటించింది. ఆడదే ఆధారం,మౌనరాగం,ప్రేమనగర్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్ లో నటించి తన నటనతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జి తెలుగులో సూర్యకాంతం సీరియల్ లో ప్రవల్లిక పాత్రలో,స్టార్ మా లో ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో రాశి పాత్రలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది.