MoviesTollywood news in telugu

గోపిచంద్ కెరీర్ లో టాప్ 10 సినిమాలు ఇవే…మీరు చూసారా…?

Gopichand Top 10 Movies :దివంగత స్టార్ డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపీచంద్ విలన్ గా మెప్పించి, హీరోగా ఎదిగి స్టార్ హోదా తెచ్చు కున్నాడు. క్లాస్,మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. విలన్ క్యారెక్టర్స్ తర్వాత హీరోగా ఎనర్జీ ఇచ్చిన మూవీ యజ్ఞం. ఇది 2004లో రిలీజయి మంచి హిట్ అందుకుంది. ఇక పరుచూరి మురళీ డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రుడు మూవీ లో గోపీచంద్ సరసన గౌరీ పండిట్ హీరోయిన్ గా చేసింది. కె విశ్వనాధ్ కీలక పాత్ర పోషించడం బాగా కనెక్ట్ అయింది. కళ్యాణ్ మ్యూజిక్ అలరించింది.

ఇక రణం మూవీ లో హీరోయిన్ గా కామ్నా జెట్మలానీ నటించింది. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో 2006లో రిలీజై మంచి హిట్ అందుకుంది. ఇక 2007లో వచ్చిన లక్ష్యం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించిన ఈ మూవీలో జగపతి బాబు పోలీసాఫీసర్ గా కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది ఒక్కడున్నాడు మూవీ చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వచ్చి మంచి గుర్తింపు పొందింది. శివ డైరెక్షన్ లో అనుష్క ,గోపీచంద్ జంటగా 2008లో వచ్చిన సౌర్యం మూవీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇందులో మణిశర్మ బాణీలు ఆకట్టుకున్నాయి.

శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లౌక్యం మూవీ 2014లో రిలీజయింది. ఇతడి కెరీర్ లో నెంబర్ వన్ బెస్ట్ మూవీ. గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన జిల్ మూవీ రాధాకృష్ణ డైరెక్షన్ లో 2015లో వచ్చింది. గోపీచంద్ డ్యూయెల్ రోల్ వేసిన గౌతమ్ నంద మూవీ ఫీల్ గుడ్ మూవీగా నిల్చింది. విలన్, హీరో ఇలా రెండు షేడ్స్ లో గోపీచంద్ నటన హైలెట్. సంపత్ నందు డైరెక్షన్ లో 2017లో రిలీజయింది. కాగా గోపీచంద్ నుంచి వచ్చిన ప్రయోగాత్మక మూవీ సాహసం బాగానే ఆకట్టుకుంది. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో తాప్సి హీరోయిన్.