తాప్సీకి ఎన్ని కోట్ల అస్థి ఉందో తెలుసా?
Tollywood Heroine taapsee :టెక్కీగా పనిచేస్తూ టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం మూవీతో ఎంట్రీ ఇచ్చిన తాప్సి కి ఈ సినిమా మంచి పేరే తెచ్చింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. ఇక టాలీవుడ్,బాలీవుడ్ లలో బిజీ హీరోయిన్ గా మారింది. హసీనా దిల్ రుబా, జనగణమన,రష్మీ రాకెట్,లూప్ లపేటా,దోబారా మూవీస్ ఈమె షూటింగ్స్ పూర్తయి,రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
ఇక అన్నాబెల్లె,ఏలియన్,శభాష్ మిధు మూవీస్ షూటింగ్స్ దశలో ఉన్నాయి. గత ఏడాది ఈమె నటించిన థప్పడ్ మూవీ రిలీజై, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె సినిమాల ద్వారా ఆస్తులు బాగానే కూడబెట్టిందని టాక్. బిఎం డబ్ల్యూ 5సిరీస్,మెర్సీ డెస్ బెంజ్ ఎస్ యు వి. రెనాట్ కాఫూట్ వంటి ఆధునిక కార్లు ఈమె దగ్గర ఉన్నాయి. ఇక ఆమధ్య ముంబైలో పాష్ ఏరియాలో ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిందట.
అంతేకాకుండా చెన్నై, హైదరాబాద్ లలో కూడా తాప్సి కి అపార్ట్ మెంట్స్ ఉన్నాయట. ఇక మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ స్టార్ తో డేటింగ్ లో ఉందని టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ మాత్రం లేదు. ఇక ఒక్కో సినిమాకు 80లక్షల నుంచి కోటిన్నర వరకూ అందుకునే ఈమెకు 2019నాటికే 42న్నర కోట్లు ఆస్తులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.