Healthhealth tips in telugu

గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా… ఈ నిజాన్నితెలుసుకోకపోతే డేంజర్ లో పడినట్టే…?

wheat flour side effects In Telugu : మనలో చాలామంది గోధుమపిండి మంచిది అనే భావనతో అన్నంకి బదులు గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటూ ఉంటారు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు అన్నం మానేసి చపాతి తింటుంటారు. అయితే గోధుమ పిండి ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయానికి వస్తే గోధుమ పిండిని ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు.

ఏదైనా లిమిట్ గా తీసుకుంటే మనకు తగినంత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది ఇది శరీరంలో ఎక్కువ అయితే కొన్ని సమస్యలు వస్తాయి నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుందని మనలో చాలామంది భావించి తింటూ ఉంటారు. రిఫైన్డ్ చేసిన గోధుమపిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటెన్ ఎక్కువగానే ఉంటుంది అందువల్ల గోధుమ పిండి ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్య, పేగుల్లో వాపు, నీళ్ళతో కూడిన విరేచనాలు వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా విటమిన్ కె,ఇరన్ లోపం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గోధుమలను మనం ఆడించుకుని పిండి తయారు చేసుకొని వాడితే ఎటువంటి సమస్యలు ఉండవు. మార్కెట్లో దొరికే గోధుమపిండిలో ఫైబర్ తక్కువగాను గ్లూటెన్ ఎక్కువగానే ఉంటుంది అదే మనం ఆడించుకున్న పిండిలో ఫైబర్ ఎక్కువగానూ గ్లుటెన్ తక్కువగానూ ఉంటుంది. అందువల్ల గోధుమలను ఆడించుకున్న పిండి మంచిది.