చిన్న వయస్సులోనే జంధ్యాల ఎందుకు దూరమయ్యారో తెలుసా ?
Tollywood Director Jandhyala : తెలుగు చిత్ర పరిశ్రమలో సునిశిత హాస్యానికి పెట్టింది పేరు జంధ్యాల. ద్వంద్వార్ధాలు లేకుండా ఇంటిల్లిపాదీ నవ్వుకునే హాస్యం మేళవించి,కొత్త కొత్త పదాలతో సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన హాస్య బ్రహ్మ జంధ్యాల. రచయితగా,దర్శకుడిగా,నటుడిగా జంధ్యాల టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడమే కాదు,ఎంతోమంది నటులకు, కమెడియన్స్ కి ఇండస్ట్రీలో చోటుకల్పించి ఎదగడానికి దోహదపడ్డారు.
ఒక పక్క దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వంటి కమర్షియల్ దర్శకుల దగ్గర మాటల రచయితగా పనిచేస్తూనే,మరోపక్క కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీస్ మాటలు రాసిన ఘనుడు జంధ్యాల.అయితే ఈయన చిన్న వయస్సులోనే ఈలోకం నుంచి దూరమయ్యారు. ఇప్పటికీ ఈయనను తలచుకోని వాళ్ళు ఉండరు. తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ రచయిత,దర్శకుడూ జంధ్యాల అని చెప్పక తప్పదు.ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు ఈయన దగ్గర అసిస్టెంట్ గా చేసారు.
పాతికేళ్ల కెరీర్ లో 350సినిమాలకు కథ, మాటలు అందించగా, 39సినిమాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తో చంటబ్బాయి, బాలకృష్ణతో సీతారామ కళ్యాణం వంటి మూవీస్ కి జంధ్యాల దర్శకత్వం వహించారు. అంతేకాదు మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఇష్టపడి మరీ తీసిన హాస్యభరిత చిత్రం అహనా పెళ్ళంట ఇండస్ట్రీ హిట్. ఇందులో రాజేంద్రప్రసాద్,కోట శ్రీనివాసరావు,బ్రహ్మానందంలకు మంచి పేరు వచ్చింది.
ఈయనకు మద్యం అలవాటు వలన ఆరోగ్యం దెబ్బతిని 50ఏళ్ళ ప్రాయంలోనే చనిపోయారని టాక్. కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని బహిరంగంగానే ఖండించారు. ఏది ఏమైనా ఒక మంచి దర్శకుడు మన మధ్య లేకుండా పోయారు. హాస్యం అంటే జంధ్యాల గుర్తుకు వస్తారు. ఆయన అంతలా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించారు.