నమ్మి మోసపోయిన డాక్టర్ బాబు…ఎవరి చేతిలో…అయ్యో పాపం..?
Karthika Deepam Serial Karthik : నమ్మితేనే ఎవరైనా మోసం చేయగలరు. నమ్మించి మోసం చేయడం కొత్తేమి కాదు. అయితే జీవితంలో ఏదో ఒకసారి చాలామంది ఇలా మోసపోవడం సహజం. అలాగే బుల్లితెర స్టార్ హీరో నిరుపమ్ పరిటాల విషయంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే మోసం చేసిన వ్యక్తి పేరు మాత్రం అతడు వెల్లడించలేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా నటిస్తూ విశేష ప్రజాదరణ చూరగొన్నాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటూ మోసపోయిన విషయాన్ని నిరుపమ్ పరిటాల చెప్పుకొచ్చాడు. కమర్షియల్ గా నమ్మించి మోసగించాడని వెల్లడించాడు. కాగా కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు వేషంలో నిరుపమ్ పరిటాల ఏడుపు గురించి ప్రస్తావించగా, మగవాళ్ళు ఏడిస్తే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందా అనిపించిందని పేర్కొన్నాడు.
చంద్రముఖి సీరియల్ తో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ పరిటాల పలు సీరియల్స్ లో నటిస్తూ,సూపర్ స్టార్ అయ్యాడు. వెబ్ సిరీస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. సినిమాల్లో ఛాన్స్ వస్తే చేస్తానని, అయితే సీరియల్స్ వదిలేసి మాత్రం వెళ్లబోనని స్పష్టం చేసాడు. కార్తీకదీపం సీరియల్ కి వస్తున్న ఫాన్ ఫాలోయింగ్ పట్ల సంతోషం వ్యక్తంచేశాడు.