రామ్ చరణ్ కెరీర్ లో TOP 7 సినిమాలు…మీరు చూసారా…?
Ram Charan Top 7 Movies :మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ విభిన్న తరహా పాత్రలు చేసి మెప్పించాలనే తపన మెండుగా ఉంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మూవీ మగధీర. రెండు జన్మల ఇతివృత్తంతో కూడుకున్న ఈ మూవీ ఎస్ ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. నటన,కామెడీ,కీరవాణి సాంగ్స్ ఇలా అన్నీ ఈ సినిమా అఖండ విజయానికి బాటలు వేసాయి. ఇక 2018లో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. చెవిటి వాడి క్యారెక్టర్ లో అద్భుత నటన కనబరిచాడు. సమంత యాక్టింగ్,దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అదిరాయి. 200కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మూవీగా రికార్డు కెక్కింది.
చరణ్ లో మాస్ ఎలిమెంట్స్ అధికంగా గల నాయక్ మూవీ ఫాన్స్ కి కొత్త అనుభూతిని ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ మూవీ లో చెర్రీ డబుల్ రోల్ అలరించింది. అమలాపాల్,కాజల్ గ్లామర్,థమన్ సంగీతం కుదిరాయి. వివి వినాయక్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎవడు మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రమాదంలో మరణించిన రామ్ చరణ్ ఫేస్ ను ప్రమాదంలో ఉన్న అల్లు అర్జున్ కి అమర్చి,సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చిన ఈ సినిమా 2014లో రిలీజై, ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మలిచారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఆకట్టుకున్నాయి. 2016లో సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ధ్రువ మూవీ కూడా అద్భుత కలెక్షన్స్ సాధించింది. అరవింద్ స్వామి విలన్ గా చేయడం మరో ఆకర్షణ. 90కోట్లు కలెక్ట్ చేసింది.
అలాగే రచ్చ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. కొత్త తరహాలో డైరెక్టర్ సంపత్ నంది రూపొందించిన ఈ మూవీ 2012లో రిలీజయింది. తమన్నా హీరోయిన్ గా గ్లామర్ పండించింది. మణిశర్మ సాంగ్స్ కుదిరాయి. ఇక చరణ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీ పూరి జగన్నాధ్ మార్క్ ని చూపించింది. 2008లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కి జరిగిన హంగామా ఏ సినిమాకు జరగలేదు. ఇక చరణ్ నటన, హీరోయిన్ అందాలు, అన్నీ అమరాయి. స్వశక్తినే నమ్ముకోవాలన్న కాన్సెప్ట్ చరణ్ నటనలో కన్పిస్తుంది.