ఆర్యన్ రాజేష్ భార్య సుభాషిణి గురించి నమ్మలేని నిజాలు..!!
Tollywood Hero Aryan Rajesh :ఆర్యన్ రాజేష్ దర్శకుడు,నిర్మాత అయినా E.V.V. సత్యనారాయణ పెద్ద కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ హీరో అల్లరి నరేష్ కి అన్నయ్య. తెలుగు,తమిళంలలో హీరోగా నటించాడు ఆర్యన్ రాజేష్. అయితే ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ సినిమాల్లో నటించటం లేదు. నిర్మాతగా మారాడు. ఆర్యన్ రాజేష్ వివాహం చాలా విషాదకరమైన పరిస్థితిలో జరిగింది.
2012 ఫిబ్రవరి 11 న ఆర్యన్ రాజేష్ సుభాషిణిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహమే. తండ్రి E.V.V. సత్యనారాయణ మరణించిన కొన్ని రోజులకే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఈ సంబంధాన్ని E.V.V. సత్యనారాయణ కుదిర్చారు. 2011 లో E.V.V. సత్యనారాయణ అయన స్నేహితుడి కూతురు సుభాషిణి ఫోటోను ఆర్యన్ రాజేష్ కి పంపి పెళ్లి చేసుకోవాలని చెప్పారు.
ఫోటో చూసిన ఆర్యన్ రాజేష్ రిజెక్ట్ చేస్తే…అప్పుడు E.V.V. సత్యనారాయణ డైరెక్ట్ గా చూస్తే నీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పి రాజమండ్రిలోని జేగురుపాడు తీసుకువెళ్లారు. ఆ పెళ్ళిచూపుల్లో సుభాషిణి అందంగా కనపడటంతో ఆర్యన్ రాజేష్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
వీరి పెళ్లిచూపులు 2011 జనవరి 5 న జరగగా జనవరి 11 న E.V.V. సత్యనారాయణ గుండె పోటుతో సడన్ గా చనిపోయారు. అప్పటి నుండి సుభాషిణి కుటుంబం E.V.V. సత్యనారాయణ కుటుంబానికి అండగా నిలిచింది. సుభాషిణి హైదరాబాద్ వచ్చి E.V.V. సత్యనారాయణ భార్య దగ్గర ఉండి సేవలు చేసింది.
పెళ్ళికి ముందే తమతో కలిసిపోయి తమ కష్టాల్లో పాలు పంచుకున్న సుభాషిణిని E.V.V. సత్యనారాయణ సంవత్సరీకం అయ్యాక 2012 ఫిబ్రవరి 11 న వివాహం చేసుకున్నాడు ఆర్యన్ రాజేష్. ఆర్యన్ రాజేష్ తల్లి,సుభాషిణి మధ్య బంధం పెరిగి తల్లి కూతుళ్లుగా కలిసిపోయారు.
సుభాషిణికి తన భర్త నటించిన అన్ని సినిమాలు ఇష్టమేనట. లీలామహల్ సెంటర్ సినిమాను చాలా సార్లు చూసిందట. 2012 డిసెంబర్ 1 న వీరికి కొడుకు పుట్టటంతో అందరు మరల E.V.V పుట్టాడని అందరూ సంబరాలు చేసుకున్నారు.