రాత్రి పడుకునే ముందు వీటిని తాగితే బరువు తగ్గుతారట…నిజమా…!
Weight Loss Tips In telugu :ఈ కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కఠినమైన డైట్ కఠినమైన వ్యాయామం వంటివి చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోగా నీరసం వచ్చేస్తుంది అలా కాకుండా మంచి పోషకాహారం తీసుకుంటూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు మెంతి టీ తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మెంతిపొడి వేసి బాగా మరిగించి వడగట్టి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకోవాలి ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగటం ప్రారంభం అవుతుంది దాంతో తొందరగా బరువు తగ్గుతారు.
దాల్చిన చెక్క టీ కూడా బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి లేదా రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్క వేసి మరిగించాలి ఈ నీటిని వడగట్టి కొంచెం తేనె కలుపుకుని తాగాలి. ఈ రెండింటిలో మీకు నచ్చిన టీని తాగితే బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి పోతుంది. అయితే డయబెటిస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండా తాగాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.