సూర్య వెబ్ సిరీస్ మౌనిక రెడ్డి రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?
Surya Web Series Heroine Mounika Reddy : సూర్య వెబ్ సిరీస్ లో అంజలి పాత్రలో నటిస్తున్న మౌనిక రెడ్డి నెటిజన్స్ కి తన నటనతో బాగా దగ్గరైంది. అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్ తో అప్పూగారు గా అలరించిన మౌనిక రెడ్డి సూర్య వెబ్ సిరీస్ లో చేసిన నటనకు తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఫాన్ ఫాలోయింగ్ ఉంది. 1994ఏప్రియల్ 10న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర కొలిపరలో జన్మించిన మౌనిక రెడ్డి కి ప్రస్తుతం 27ఏళ్ళు. ఈమెను అప్పూగారు,అంజలి,మౌనిక అని పిలుస్తారు. మౌనిక తండ్రి సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. తల్లి రాణి గృహిణి.
తెనాలి కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వైజాగ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలలో చదివి తిరుపతి విద్యానికేతన్ కాలేజీ నుంచి బిటెక్ పూర్తిచేసింది. వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ఎంబీఏ పూర్తిచేసింది. ఈమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఇక స్టడీస్ పూర్తయ్యాక హైదరాబాద్ హెచ్ జి ఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మౌనిక ఫోటో షూట్స్, వీడియోస్ ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తుంది. అలా ఫేస్ బుక్ లో ఫొటోస్ చూసి అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు అనే వెబ్ సిరీస్ లో ఆడిషన్స్ కి రావాలని మెసేజ్ చేశారట. సెలక్ట్ అయి నటించింది. ఈటివి ప్లస్ లో ప్రసారమైన ఈ వెబ్ సిరీస్ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చింది.
అయితే ఉద్యోగం చేస్తూనే నటిస్తూ, 17ఎపిసోడ్స్ వరకూ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. 18వ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయడంతో మొదటిసారిగా 5వేలు రెమ్యునరేషన్ లభించింది. రెండేళ్లకు జాబ్ వదిలేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ భరత్ ఓ సినిమాకు కథ తయారు చేసి, మౌనికను హీరోయిన్ అనుకున్నారట. ఎందుకో ఈ మూవీ ఆగిపోయింది. అయితే సూర్య వెబ్ సిరీస్ లో క్యూట్ గా నటిస్తూ మనముందుకు వచ్చింది. ఈమెకు మహేష్ బాబు ఇష్టమైన హీరో. సమంత,అనుష్క ఇష్టమైన హీరోయిన్స్. గోవా ఇష్టమైన ప్రదేశం. నెలకు 50వేలు సంపాదించే ఈమెకు పిజ్జా,ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ట్రావెలింగ్,యాక్టింగ్,డాన్సింగ్ హాబీస్. షేక్ పేటలోని 85లక్షలు విలువచేసే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఈమెకు ఓ కారు ఉంది.