MoviesTollywood news in telugu

ఉదయ్ కిరణ్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమాలు

Uday Kiran Top Movies :టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగి, ఆతర్వాత పరిణామ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి,ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. దృవ తారగా వెలుగొందిన ఉదయ్ కిరణ్ చిత్రం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,తొలి సినిమాతోనే సత్తా చాటాడు. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఉదయ్ అనుకుని ఉండడు. రీమా సేన్ హీరోయిన్. తేజ తొలిసారి డైరెక్షన్ చేసిన ఈ మూవీని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఆర్పీ పట్నాయక్ తన మ్యూజిక్ తో అలరించాడు. రెండోసినిమా కూడా తేజ డైరెక్షన్ లోనే వచ్చిన నువ్వు నేను బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసాయి.

చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఒకరంటే ఒకరు ఇష్టపడుతూ,అనివార్య కారణాల వలన దూరమై,ఆతర్వాత ఎలా దగ్గరయ్యారన్నది మనసంతా నువ్వే మూవీ చాటింది. వయస్సుతో పాటు మనసులో కూడా ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకుంటూ, పెద్దయ్యాక ఒకరికొకరు తెల్సినా బయట పడక పోవడం,చెల్లెలి పెళ్లికోసం ఉదయ్ కిరణ్ తన ప్రేమను త్యాగం చేయాలనుకోవడం వంటి కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా లో ఆర్పీ పట్నా యక్ పాటలు అసెట్ అయ్యాయి. వి ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో 2001లో రిలీజైన ఈ మూవీని ఎం ఎస్ రాజు నిర్మించారు.

ఇక ఉదయ కిరణ్ హీరోగా, ప్రత్యూష,గజాల హీరోయిన్స్ గా నటించిన మూవీ కలుసుకోవాలని మూవీ 2002లో వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ సూపర్. సినిమా ఏవరేజ్ అయింది. తాను ఇష్టపడే అమ్మాయి తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని తెల్సి,తన ప్రేమను హీరో త్యాగం చేయాలని అనుకోవటం కాన్సెప్ట్ తో రూపొందిన నీ స్నేహం మూవీ లో కె విశ్వనాధ్ కీలక పాత్ర పోషించారు. 2005లో తేజ డైరెక్షన్ లో వచ్చిన ఔనన్నా కాదన్నా మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది. ఉదయ్ నటనకు ఆర్పీ పట్నాయక్ పాటలు అదరగొట్టాయి. వి ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన ఉదయ్ మాస్ మూవీ శ్రీరామ్ ఏవరేజ్ అయింది.